ఓట్ల ‘పందేలు’…

-

ఏపీలో మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంక్రాంతి పండుగకు రాజకీయ హడావుడి సంతరించుకుంది. ఇందులో భాగంగానే…  ఏపీలో రూ.రెండు వేల కోట్లకు పైగా ఈ ఏడాది పందేలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోళ్ల పందేలకు పెట్టిందే పేరైన… ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని రాజకీయ నేతలు ఆధ్వర్యంలో భారీ పందేలు జరగనున్నాయి.. అధికార పార్టీ పెద్దల అండలతో… కోడి పందేలతో పాటు బరుల పక్కనే పెద్దఎత్తున జూదం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.

అయితే గతేడాది దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర చేతులు మారగా..ఈ సారి రెండు వేల కోట్ల వరకు చేతులు మారనున్నట్లు తెలుస్తోంది. అయితే చిన్నా చితకా.. ఒక్కో పందెంలో నేరుగా రూ.5 వేల నుంచి రూ.5 లక్షల వరకు పందెం వేస్తే దానికి పైపందేలు రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు జరుగుతుంటాయి. ఈ లెక్కన ఒక్కో బరిలో రోజుకు కనీసం 15 కోడి పందేలను వేస్తుంటారు. కత్తి కట్టని కోడిని బరిలో నిలుపుతామని పైకి చెబుతూనే వారి పనిని కానిచ్చేస్తున్నారు. ఏది ఏమైన రాజకీయ అండ ఉంటే ఏది చేసిన చెల్లిపోతుంది కదా.

Read more RELATED
Recommended to you

Latest news