ఓటర్లు ఆకట్టుకునే విధంగా, వారి సదుపాయాలను కల్పించడంలో ఎన్నికల సంఘం టెక్నాలజీని వాడుకుంటోంది. ఇందులో భాగంగా.. ఓటరు స్లిప్పును పొందే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం టి- పోల్ (Te-Poll) అనే యాప్ ద్వారా కల్పించింది. ఈ యాప్ ని ఆండ్రాయిడ్ ఫోన్లలోని ప్లేస్టోర్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జిల్లా పేరు, ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేస్తే ఓటరు స్లిప్పు వస్తుంది.
రాష్ట్రంలోని 12,732 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం తొలి విడతగా 197 మండలాల్లో 4480 పంచాయతీల్లోని ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆదివారంతో నామినేషన్ల పర్వం పూర్తవడంతో.. సోమవారం నుంచి ప్రచారం ఊపందుకోనుంది. షెడ్యూలు ప్రకారం జనవరి 21, 25, 30 తేదీల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
పంచాయతీ ఎన్నికల్లో ఈసీ వినూత్న ప్రయోగం..
-