ఎయిరిండియా ఫ్లైట్‌లో బొద్దింక పడిన ఆహారం..

-

ఎయిరిండియా విమానంలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. ప్రయాణికుడికి అందజేసిన ఆహారంలో బొద్దింక వచ్చింది. అయితే, బొద్దింక పడిన ఆహారం తినడం వల్ల రెండేళ్ల బాలుడికి ఫుడ్ పాయిజన్ అయినట్లు ఎయిరిండియా సంస్థకు ఫిర్యాదు అందింది.సెప్టెంబర్ 17న ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లే విమానంలో ఈ ఘటన చోటుచేసుకోగా, ఆలస్యంగా ఈ ఘటన వెలుగుచూసింది. అనారోగ్యానికి గురైన బాలుడి తల్లి బొద్దింక పడిన భోజనాన్ని,ఫొటోలను నెట్టింట పోస్టు చేశారు.

ఎయిరిండియా, డీజీసీఏ, పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని ట్యాగ్ చేశారు.‘మేం బొద్దింకను చూసే సరికి నాతో పాటు మా రెండేళ్ల కుమారుడు సగానికి పైగా భోజనం తిన్నాడు. దీంతో ఫుడ్ పాయిజనింగ్‌తో బాధపడ్డాడు’ అని సుయేష సావంత్ అనే ప్యాసింజర్ సోషల్‌మీడియా ‘ఎక్స్’లో పోస్టు చేసింది.దీనిపై ఎయిర్‌ఇండియా సిబ్బంది స్పందిస్తూ ..ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు.దర్యాప్తు కోసం క్యాటరింగ్ విభాగానికి ఆదేశాలు జారీ చేశామన్నారు.భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రతినిధి హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news