ముధోల్ మండలం ఎడ్ బిడ్ గ్రామానికి చెందిన భుమవ్వ అనే మహిళ ఇటీవల అనారోగ్యం తో మరణించింది. ఆమె భర్త కూడా కొన్నేళ్ల క్రితం మరణించారు. అయితే వారికి ఉన్న ఐదేళ్ల రోషిని తల్లి తండ్రులు మరణించడం తో అనాథలు గా మారింది. ఈ విషయాన్ని ఓ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ కు తెలియజేశారు. అమ్మాయిని ఆదుకోవాలని ట్విట్టర్ లో కేటీఆర్ ను కోరుతూ ట్వీట్ చేశారు. కాగా మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్ ను జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖి కి రీట్వీట్ చేశారు. దానికి స్పందించిన కలెక్టర్ ముషారఫ్ చిన్నారి వద్దకు వెళ్లి పరామర్శించారు. చిన్నారి బాధ్యతను ప్రభుత్వం చూసుకుంటుంది అని హామీ ఇచ్చారు.
అంతే కాకుండా చిన్నారి కోసం సేకరించిన లక్షా డెబ్బై వేల విరాళం ను ఆమెకు అప్పగించారు. అనంతరం ఆ చిన్నారిని ఆదిలాబాద్ శిశు గృహానికి తరలించారు. ఇక ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారి తో మాట్లాడగా ఆమె మాటలకు ఆశ్చర్యపోయాడు. నువ్వు ఏ స్కూల్ కు వెలతావ్ అనగా బాలబడికి అని సమాధానం ఇచ్చింది. అక్కడ ఏం చెబుతారు అంటే అన్నం గుడ్డు అంటూ సమాధానం ఇచ్చింది. అంతే కాకుండా మీ టీచర్ ఎవరు అని అడగ్గా…. అగో ఆమెనే అంటూ చేయి చూపించింది. దాంతో కలెక్టరు బాగా ఉషారుగా ఉన్నావ్ రిషిని చదువుకుంటావా అని అడిగారు.