కల్నల్ సంతోష్ బాబుకు మహావీరచక్ర.. తండ్రి అసంతృప్తి ?

-

కల్నల్ సంతోష్ బాబు కు మహావీర చక్ర పురస్కారం దక్కడం సంతోషంగా గర్వంగా ఉందని  సంతోష్ బాబు తండ్రి  బిక్కుమళ్ల ఉపేందర్ పేర్కొన్నారు. పరమ వీర  చక్ర పురస్కారం కల్నల్ సంతోష్ బాబుకు రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని మేము బావిస్తున్నామని అదే కొద్దిగా అసంతృప్తి గా ఉందని ఆయన అన్నారు. మహా వీర చక్ర పురస్కారం కూడా తక్కువేమి కాదన్న ఆయన సంతోష్ బాబు త్యాగానికి అరుదైన పురస్కారం దక్కిందని అన్నారు.

కల్నల్ సంతోష్ బాబు కు  మహావీర చక్ర పురస్కారం దక్కినట్లు మాకు రాత్రి వాట్సప్ లో లెటర్ పెట్టారని, అయితే ఈ రోజు మహావీర చక్ర పురస్కారం మాకు ప్రదానం చేస్తామని చెప్పలేదు..ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్లి మహా వీర చక్ర పురస్కారం తీసుకుంటామని ఆయన అన్నారు. మహా వీర చక్ర పురస్కారం చూశాక మావాడి శక్తి సామర్ధ్యాలు ధైర్య సాహసాలు తెలుస్తున్నాయని ఆన అన్నారు.  15 ఏళ్ల సర్వీస్ లో 10 ఏళ్ళు ఫీల్డ్ సర్వీస్ చేశాడని ఆర్మీలో పని చేసే అవకాశం అందరికిరాదు సంతోష్ బాబుకు వచ్చింది. సంతోష్ బాబు ఫ్రూ చేసుకున్నాడు. ధన్యజీవుడు అయ్యాడని ఆయన్న అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news