తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ అలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన కేవలం కమెడియన్ గానే మాత్రమే కాకుండా హీరోగా కూడా వ్యవహరించారు. ఇక ఆ తర్వాత పలు షోలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. ఇకపోతే ఈటీవీలో ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాంను గత కొన్ని సంవత్సరాలుగా నిర్విరామంగా నడిపిస్తున్న ఈయన ఎంతోమంది సెలబ్రిటీలను కూడా ఇంటర్వ్యూ చేశారని చెప్పవచ్చు.ఇకపోతే ఎవరైనా సరే ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఎవరో ఒకరి ఇన్స్పిరేషన్ తప్పనిసరి. అలా కమెడియన్ ఆలీ కూడా ఆయన ఇన్స్పిరేషన్ తోనే ఇండస్ట్రీలోకి పరిచయమయ్యారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.పూరీ జగన్నాథ్ , పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా ఆలీకి మంచి పేరు వచ్చింది. ఇక ఈ మధ్యకాలంలో ఎఫ్ త్రీ సినిమాలో తన పాత్రతో మరొకసారి ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకున్నారు. బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈయన స్టార్ కమెడియన్ గా మారి మరింత గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆలీ కొన్ని విషయాలను వెల్లడించడం జరిగింది. ఇండస్ట్రీలోని ఆర్టిస్టులలో చాలామంది ఇతరుల కష్టాల్లో ఉంటే తమ దగ్గర ఉన్న డబ్బులు తీసి ఇచ్చేస్తారని ఆలీ కామెంట్లు చేశారు. ఇక ఒకానొక సమయంలో రాజబాబు కష్టాల్లో ఉంటే ఆదుకున్నామని కూడా ఆలీ తెలిపారు.
రాజబాబు ఇతరులకు సహాయం చేసే గుణం కలిగిన ఏకైక వ్యక్తి అని చెప్పినా అలీ.. ఆయన పిల్లలు ఏది అడిగినా వెంటనే ఇచ్చే గుణాన్ని రాజబాబు కలిగి ఉన్నారని కామెంట్లు చేశారు. ఇకపోతే ఒకసారి ఐదు సంవత్సరాల పిల్లవాడు రాజబాబును రోడ్డుపై వెళ్లే కారు కావాలని అడగడంతో వెంటనే మూడు లక్షల రూపాయలు పెట్టి ఆ కారును కొనుగోలు చేసి మరీ ఇచ్చారని ఆలీ చెప్పుకొచ్చారు. ఇకపోతే ఎన్నో విద్యాసంస్థలను కూడా ఏర్పాటు చేసి నిరక్షరాస్యత లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు అని ఆలీ తెలిపారు. ఇక ఇలాంటి గొప్ప వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఇండస్ట్రీలో కమెడియన్ గా మారానని తెలిపారు అలీ.