సాధారణంగా ఫిమేల్ కమెడియన్ లేదా మేల్ కమెడియన్.. ఎవరైనా సరే ఎక్కువగా వారు మాత్రమే బాగా పాపులర్ అవుతూ ఉంటారు. ఇక వారి కుటుంబానికి సంబంధించిన విషయాలను అలాగే వారి భార్య లేదా భర్త, పిల్లలను ఎప్పుడు కూడా మీడియా ముందుకు తీసుకొచ్చిన దాఖలాలు లేవు. కానీ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో చాలామంది తమ కుటుంబ సభ్యులను పరిచయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే జాతి రత్నాలు సినిమా ద్వారా బాగా గుర్తింపున సొంతం చేసుకున్న రాహుల్ రామకృష్ణ కూడా తాజాగా తన భార్య ను అభిమానులకు పరిచయం చేశారు. హీరోయిన్స్ ని మించిన అందంతో చూపరులను ఆకట్టుకుంటోంది.
రాహుల్ రామకృష్ణ అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ గుర్తింపు తెచ్చుకున్నారు. విలక్షణమైన పాత్రలలో కూడా మెప్పిస్తున్నాడు.. ఇటీవలే పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ లో కూడా సీరియస్ రోల్ ప్లే చేసి మంచి మార్కులు వేయించుకున్నాడు.
ఇక గత ఏడాది చివర్లో ఓటీటీ లో విడుదలైన నెట్ మూవీలో కూడా విలక్షణమైన నటన కనబరిచారు. ఇక సినిమాలపరంగా దూకుడు మీదుండే రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటాడు. ఇతను పెట్టే ట్వీట్ లు హాట్ టాపిక్ అవుతున్నాయి. కొన్ని అయితే వివాదాస్పదంగా మారుతున్నాయి కూడా. ఇంస్టాగ్రామ్ ద్వారా ఇతడికి రెండు లక్షల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు.
ఇకపోతే గతంలో ఇతడికి ఒక లవ్ స్టోరీ ఉన్నట్లు కూడా వార్తలు వైరల్ అయ్యాయి. ఒక అమ్మాయితో రాహుల్ తెగ తిరిగాడు అని, కానీ అమ్మాయితో బ్రేకప్ చెప్పేసి మూడేళ్లు సింగిల్ గా ఉన్నాడని వార్తలు కూడా వినిపించాయి. ఈ ఏడాదే ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ మొదటిసారి తన భార్య ఫోటోను షేర్ చేశాడు. ఇక నా భార్యకు హాయ్ చెప్పండి.. నా ఆవేశాన్ని, నా పిచ్చిని అర్థం చేసుకునే ఏకైక వ్యక్తి అంటూ రాసుకొచ్చారు. ఇక రాహుల్ రామకృష్ణ అలాగే తన భార్యకు అభినందనలు తెలియజేస్తున్నారు నెటిజన్స్.