బలగం వేణు లో ఈ ట్యాలెంట్ కూడానా..?

-

జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు. తర్వాత బలగం సినిమాకి దర్శకత్వం వహించి తనలో ఒక మంచి దర్శకుడు ఉన్నాడని ప్రూవ్ చేసుకున్నారు. పాతికేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి కమెడియన్ గా వేణు వచ్చాడు. పలు సినిమాల్లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు ఒక్కో సినిమాతో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ తర్వాత నెమ్మదిగా జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యాడు అయితే తెలంగాణ నేటివిటీతో సినిమా తీయడం వలన ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు.

ఇప్పుడు నాచురల్ స్టార్ నానితో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు సినిమాల్లోకి రాకముందు తను ఏం చేశాడో చెప్పాడు. వేణు తల్లి తండ్రులు కూరగాయల వ్యాపారం చేస్తే తాను కూడా చిన్నప్పటినుండి కూరగాయలు అమ్మేవాడట కొంచెం స్పెషల్ గా ఉండాలని మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నట్లు వేణు చెప్పాడు. మార్షల్ ఆర్ట్స్ లో రెండు సార్లు స్టేట్ చాంపియన్ గా గెలిచాడట చిన్నప్పటినుండి అందరూ తనని బాబు మోహన్ కి చుట్టంలా ఉన్నావని అనేవారట కమెడియన్ గా ఉన్నావని అంతా చెప్పడంతో సినిమాలు మీద ఆసక్తి పెరిగే సినిమాల్లోకి వచ్చినట్లు వేణు చెప్పాడు

Read more RELATED
Recommended to you

Latest news