డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన కన్నడ డబ్బింగ్ సినిమా కాంతారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొంటున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాను కన్నడలో చూసిన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ వెంటనే తెలివిగా ఆలోచించి ,తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను కొనుగోలు చేసి వెంటనే రిలీజ్ చేశారు. ఈ సినిమా హౌస్ ఫుల్స్ తో విపరీత మైన కలెక్షన్లు వసూలు చేస్తోంది. ఇప్పటికే పెట్టుబడికి ఎన్నో రెట్లు అధికంగా డబ్బులు వసూలు చేసి పెట్టింది. ఇప్పటికే ఈ చిత్రం ఎంతోమంది సినీ ప్రముఖులు నుంచి ప్రశంసలు అందుకుంది.
ప్రస్తుతం ఆ జాబితాలో వివేక్ అగ్నిహోత్రి కూడా చేరారు. తాను సినిమాను ఒక రేంజ్ లో పొగుడుతూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘కాంతార సినిమాను ఇప్పుడే చూశాను. ఇది ఒక మాస్టర్ పీస్. రిషబ్ శెట్టి అద్భుతంగా నటించాడు. ఈ చిత్రం అద్భుతమైన అనుభూతినిచ్చింది. అందరూ సినిమా ని చూడండి అంటూ రాసుకొచ్చాడు. అలాగే ఒక వీడియోని కూడా పంచుకున్నాడు.
ఆ వీడియోలో ‘‘ కాంతార మూవీ కొత్త అనుభూతినిచ్చింది. నేను ఇంత వరకు ఇలాంటి సినిమాను చూడలేదు. . రిషబ్ నువ్వు అద్భుతంగా నటించావు. నీకు అభినందనలు. నేను త్వరలోనే నా అభిప్రాయాన్ని తప్పకుండా నీతో పంచుకుంటాను. ముగింపు ఊహాకు అందని విదంగా వుంది. అందరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది, ఇంత అద్భుతమైన సినిమాను తీసి మాకు ఆనందం కలగచేసిన రిషబ్ శెట్టికి ధన్యవాదాలు’’ అని వివేక్ ఆ వీడియోలో చెప్పాడు. కాంతారా సినిమా దీపావళి కి చాలా సినిమాలు విడుదల అయినా కూడా ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చూపిస్తూ వుంది. ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాలి.