ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ ఆరవ సీజన్ ప్రసారమవుతున్న నేపథ్యంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా సరికొత్త టాస్కులు, ప్రేమ కహానీలు, రొమాన్స్ తో సహా ఎన్నో ఆసక్తికరమైన అంశాలను చూపించినా సరే అనుకున్న స్థాయిలో రేటింగ్ అయితే రావట్లేదు. ముఖ్యంగా ఈసారి ఆరవ సీజన్ కి 21 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్ లుగా అడుగుపెట్టగా.. ఇప్పటికే అందులో నలుగురు ఎలిమినేట్ అయ్యారు. వీరిలో కేవలం కొంతమంది మాత్రమే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగారు. వారిలో జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటి కూడా ఒకరు. ఈయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండడమే ఇందుకు కారణమని చెప్పాలి.
అవకాశం ఇచ్చినప్పటికీ తన మార్క్ చూపించే ప్రయత్నాలు అయితే చేయడం లేదు. ముఖ్యంగా షో లో ఇచ్చే టాస్కులలో అంత యాక్టివ్ గా కూడా పాల్గొనడం లేదు. అంతేకాదు పెద్దగా ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా చాలా సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ ప్రతి సీజన్లో కూడా ఏదో ఒక కంటెస్టెంట్ కి సీక్రెట్ టాస్క్ ను ఇస్తుంటారు అన్న విషయం తెలిసిందే. అయితే దీనిని చాలామంది ఉపయోగించుకొని వారి సత్తా చూపించే ప్రయత్నం చేస్తారు. ఇక ఈ క్రమంలోని నాలుగో వారంలో అవకాశం చంటి కి వచ్చినా అతడు విఫలం అయ్యాడు. దీంతో ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్ అయ్యే అర్హత కూడా కోల్పోయాడు.
బిగ్ బాస్ హౌస్లో సాధారణంగా కంటెస్టెంట్లకు ఫుడ్డు చాలా తక్కువగా ఉంటుంది. అందుకే కొంతమంది దొంగతనంగా తింటూ ఉంటారు. కానీ చలాకీ చంటి మాత్రం మూడు రోజులుగా హౌస్ లో ఏమి తినడం లేదట. ఈ విషయాన్ని కొంతమంది కంటెస్టెంట్లు మాట్లాడుకోవడంతో బయటకు వచ్చింది. ఎవరు బ్రతిమాలినా సరే అతడు తినడం లేదట. ఇకపోతే తాజాగా జరిగిన ఎపిసోడ్లో చలాకి చంటి అన్నం తినకుండా ఉన్న విషయాన్ని తెలుసుకున్న బాలాధిత్య ఏమైందని అడగ్గా .. ఈ వారం తానే ఎలిమినేట్ అవుతానని.. అందుకే తినాలనిపించడం లేదని చెప్పాడట. దీన్ని బట్టి చూస్తే అతడికి హౌస్ లో ఏమవుతుందని కంటెస్టెంట్ లు కూడా టెన్షన్ పడుతున్నారు . ఎలిమినేషన్ నుండి తప్పిస్తే బాగుంటుందనే వార్త కూడా వైరల్ అవుతోంది.