మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి రచ్చ.. పోలీసులకు ఫిర్యాదు

మెగా డాటర్‌ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్‌ గా నిహారిక… టాలీవుడ్‌ పరిశ్రమకు పరిచయమైంది. అయితే… ఆ తర్వాత సినిమాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేసి…ఛానల్స్‌ లో వచ్చే… కొన్ని షోలలో హంగామా చేసింది. ఈ నేపథ్యంలోనే
మెగా డాట‌ర్.. నాగ‌బాబు ముద్దుల కూతురు కొణిదెల నిహారికకు.. గుంటూరు రేంజ్‌ ఐటీ జొన్నల గడ్డ ప్రభాకర్‌ రావు కుమారుడు.. ప్రముఖ వ్యాపార వేత్త వెంకట చైతన్యకు ఇచ్చి వివాహం చేశారు. అయితే.. పెళ్లి గత డిసెంబర్‌ మాసంలో రాజస్థాన్‌ లో చాలా గ్రాండ్‌ గా జరిగింది.

ఇక ఇది ఇలా ఉండగా… తాజాగా.. నాగబాబు కూతరు నిహారిక ఇంట్లో నిన్న అర్థరాత్రి తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. నిహారిక భర్త వెంకట చైతన్య ఇంట్లో నానా రచ్చ చేశాడు. ఇంట్లో చేయడమే కాకుండా.. తోటి అపార్ట్‌ మెంట్‌ వాసులకు ఇబ్బంది కలిగేలా చేశాడు చైతన్య. దీంతో నిహారిక భర్త వెంకట చైతన్య న్యూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్ మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు అపార్ట్‌ మెంట్‌ వాసులు. అయితే.. ఇందులో ట్విస్ట్‌ ఏంటంటే.. అపార్ట్ మెంట్ వాసులపై కూడా నిహారిక భర్త చైతన్య ఫిర్యాదు చేశారు. ఇక పరస్పర ఫిర్యాదులు తీసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు… విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.