వివేకా హత్య కేసులో కీలక ఆధారాలు.. కోర్టుకు సునీల్ రిమాండ్ రిపోర్టు

-

కడప: పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ప్రధాన అనుమానితుడు సునీల్ యాదవ్‌ను రిమాండ్‌కు తరలించారు. సునీల్‌ను గోవాలో అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు.. ఆయన నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే వివేకా హత్యలో పలువురు కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి  తీసుకెళ్లారు. సునీల్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

దీంతో వివేక హత్య కేసులో తప్పించుకుని తిరుగుతున్నవారి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. సీబీఐ అధికారులు ఎవరి పేరు చెబుతారని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు వివేక హత్య ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్ అయింది.

 

కాగా గత ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి ఆయన నివాసంలోనే హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి వివేకా హత్య కేసు విచారణ కొనసాగుతోంది. కేసు సీబీఐకు అప్పగించనప్పటి నుంచి ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. పలువురు ప్రధాన అనుమానితులను విచారించారు. వివేకా దగ్గర గతంలో డ్రైవర్‌గా చేసిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు కూపీ లాగారు. దీంతో సునీల్ యాదవ్ పేరు ప్రముఖంగా బయటకు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news