కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ఆ దేశ మాజీ మంత్రి ఉజ్జల్ దోసంజ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఖలిస్థానీ మద్దతుదారులకు ప్రధాని ట్రూడో మద్దతుపై స్పందిస్తూ.. సామాజికంగా, రాజకీయంగా కూడా అతనొక ఇడియట్. కెనడా దేశ విలువల కంటే పాలిటిక్స్‌కే అతను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. ట్రూడో విధానం వల్ల ఖలిస్తానీ మద్దతుదారులకు మరింత బలం చేకూర్చిందని, మితవాత సిక్కులలో భయాన్ని కలిగించిందన్నారు. ఇదే టైంలో జస్టిన్ ట్రూడోతో గతంలో చేసిన చర్చల గురించి ఉజ్జల్ ప్రస్తావించారు.
2008-2011 మధ్య తామిద్దరం ఎంపీలుగా ఉన్నాం. అనేక విషయాలపై చర్చించే సమయంలో ఖలిస్థానీ మద్దతుదారులు కూడా తమతో ఉన్నారు.అప్పుడు ట్రూడో ఖలిస్థాని మద్దతుదారుల వాదనకే ఎక్కువ సానుకూలంగా ఉండేవారు. తానొక సామాజిక, రాజకీయ ఇడియట్ లాంటివాడు. ఈ అభిప్రాయం పట్ల ఎవరేం చెప్పినా పట్టించుకోనని తెలిపారు. దేశ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడంతో అతనొక బలహీన వ్యక్తిగా ఉజ్జల్ దోసంజ్ అభివర్ణించారు. సిక్కు వర్గానికే చెందిన ఉజ్జల్ దోసంజ్ ఖలిస్థాని మద్దతుదారులకు అనుకూలంగా ఉండరని పేరుంది.