మౌస్ కనిపెట్టిన ఆయన ఇక లేరు…!

-

మౌస్… చాలా వరకు కంప్యూటర్ వాడే వారు వాడే పరికరం. అసలు మౌస్ లేకుండా పని జరగదు అనే మాట వాస్తవం. మౌస్ లేకపోతే చేయి లేనట్లే ఉంటుంది చాలా మందికి. అలాంటి మౌస్ ని కనిపెట్టిన ఆయన  మన మధ్యన లేరు. ఆయన ఎవరో చాలా మందికి తెలియదు కదా… ఆయన పేరు విలియమ్ బిల్ ఇంగ్లీష్. ఆయన అమెరికన్ కంప్యూటర్ ఇంజినీర్ దిగ్గజం. వయసు 91 ఏళ్ళు.

ఆయన మరణించిన విషయం బయటి ప్రపంచానికి ఆలస్యంగా తెలిసింది. గత కొన్ని రోజుల నుంచి ఆయన అనారోగ్యం తో బాధ పడుతున్నారు. నేవీలో జీవిత ప్రయాణం మొదలుపెట్టిన ఆయన… రిటైర్‌మెంట్ తర్వాత ఎస్‌ఆర్‌ఐ (శ్రీ) ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి… మౌస్ తయారీలో చాలా కీలకంగా వ్యవహరించారు. మౌస్ కోసం ఆయన కెరీర్ తొలి రోజుల్లో చాలా కష్టపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news