యెస్ బ్యాంక్ సంక్షోభం తో చిక్కుల్లో పడ్డ పూరీ జగన్నాధుడి ఆలయం

-

యెస్ బ్యాంక్ లో ఏర్పడిన తీవ్ర సంక్షోభం తో ఎస్బీఐ ఈ బ్యాంక్ ను తీసేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే యెస్ బ్యాంక్ లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒడిశా లోని పూరి జగన్నాధస్వామి ఆలయానికి చెందిన సుమారు రూ. 547 కోట్ల రూపాయల డిపాజిట్లు బ్యాంక్ లో చుక్కుకున్నట్లు తెలుస్తుంది. దీనితో ఈ ప్రసిద్ధ ఆలయం చిక్కుల్లో పడినట్లు అయ్యింది. ఒక ప్రయివేట్ బ్యాంకు లో ఇంత పెద్ద మొత్తంలో ఎలా డిపాజిట్లు ఉంచారు అంటూ సర్వత్రా విమరలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క ఆలయ కమిటీ సభ్యులు కూడా ఆలయ మార్గదర్శకాలను ఉల్లఘించి డిపాజిలు చేసారు అంటూ దీనిపై దర్యాప్తు జరపాలి అని డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకు ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకోవటంతో రిజర్వ్ బ్యాంక్ యస్ బ్యాంకు నుంచి నగదు ఉపసంహరణపై పరిమితులు విధించటంతో ఇప్పుడు ఆలయ నిధులపై అనిశ్చితి నెలకొంది. మార్చి నెలలో మెచ్యురిటీ అయ్యే డిపాజిట్లను విత్ డ్రా చేసివాటిని తిరిగి జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని గత నెలలో జరిగిన దేవస్ధానం పాలకమండలి సమావేశంలో నిర్ణయించారు. దీనితో యెస్ బ్యాంక్ అధికారులను కలిసి పరిస్థితి వివరించడం తో ఈ నెల 19,23, మరియు 29 తేదీలలో మెర్చ్యురిటీ సొమ్మును చెల్లిస్తామంటూ తెలిపింది.

అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించడం తో మెర్చ్యుర్ అయిన డిపాజిట్ల పై అనిశ్చితి నెలకొంది. దీనితో ఆలయ సొమ్మును ఎలా ప్రయివేట్ బ్యాంకుల్లో డిపాజిట్లు చేసారు అంటూ కొందరు విమర్సలు చేస్తున్నారు. మరోపక్క ఆలయానికిసంబంధించిన డిపాజిట్లు తిరిగి వచ్చేలా ప్రభుత్వంతో మాట్లాడి ఉన్నత స్థాయిలో చర్యలు తీసుకుంటామని మాజీ రెవెన్యూ మంత్రి, బిజెడి నాయకుడు మహేశ్వర్ మొహంతి చెప్పారు . ఇటీవలే యెస్ బ్యాంకులో డిపాజిట్ చేసిన తిరుమల వెంకన్నకు చెందిన సుమారు.రూ.600 కోట్లను కొద్ది నెలలకిందటే ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news