తెలంగాణ రాజకీయాలు ఇప్పటికే మంచి హీటెక్కి ఉన్నాయి. ఓ వైపు టీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య అగ్గి రాజుకుంటోంది. ఇక అటు బీజేపీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో వీధి పోరాటాలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. కార్యకర్తలు కర్రలతో కొట్టుకునే దాకా పరిస్థితి వెళ్లింది. ఇలాంటి వేడి మధ్యనే ఇప్పుడు శుక్రవారం నుంచి అసెంబ్లీ ప్రారంభమవడం పెద్ద సమస్యలనే తెచ్చిపెట్టేలా ఉంది. ఇక వీరి రాజకీయ పోరాటం అసెంబ్లీ వేదికగా జరగనుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఈసారి అసెంబ్లీ సమావేశాలు దాదాపుగా వారం పాటు జరగనున్నట్టు తెలుస్తోంది. అంటే ఇప్పుడు అసెంబ్లీ వేదిక సవాళ్లు, ప్రతి సవాళ్లతో వేడెక్కడం కాయమనే తెలుస్తోంది. రీసెంట్ గా రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ మీద చేసిన డ్రగ్స్ వ్యాఖ్యలపై టీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుందని అంటున్నారు. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వం తీసుకొస్తున్న దళిత బంధ దుమారం కూడా బాగానే నడిచే అవకాశం ఉంది.
ఇక బీజేపీ దీన్ని హైలెట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి తోడయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీలు మూకుమ్మడిగా ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం కూడా ఉంది. ఇది టీఆర్ ఎస్‌కు పెద్ద ఇబ్బందిగా మారుతోంది. ఇక మంత్రి మల్లారెడ్డి రేవంత్ మీద చేసిన వ్యాఖ్యలను కూడా ప్రధానంగా టీఆర్ ఎస్ ప్రస్తావించే ఛాన్స్ ఉంది. ఇక టీఆర్ ఎస్ పార్టీ కూడా తన అస్త్రాలను సిద్ధం చేసుకునే ఛాన్స్ ఉంది.