మధ్యలో వై యస్ రాజశేఖర్ రెడ్డి ఎందుకయ్యా మాటిమాటికి ??

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవి శైలజానాథ్ కి కాంగ్రెస్ హైకమాండ్ కట్టబెట్టటం జరిగింది. ఈ సందర్భంగా శైలజానాథ్ పదవి వచ్చిన నాటి నుండి ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. విషయంలోకి వెళితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్ఆర్‌సీ బిల్లులను గురించి మాట్లాడుతూ వైయస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే దేశ రాజకీయ ముఖచిత్రం వేరేలా ఉండేదని తెలిపారు.

అంతేకాకుండా ఈ బిల్లులను తిప్పి కొట్టేవారని సీరియస్ అయ్యారు. ఇటీవల ముస్లిం సభలో పాల్గొన్న శైలజానాథ్…వైసిపి పార్టీ అధినేత జగన్ ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కి ఉన్న మైనార్టీ ఓటు బ్యాంక్ లక్ష్యంగా చేసుకుని శైలజానాథ్ మాట్లాడుతూ..బీజేపీతో కలిసి జగన్ పని చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. అసలు వైయస్ జగన్… వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

 

దీంతో ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్న గాని శైలజానాథ్ మీడియా సమావేశం పెట్టిన బయట బహిరంగసభలో ప్రతిసారి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఎత్తడం పట్ల రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు అదేవిధంగా ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు మాటిమాటికి ఆయన పేరు ప్రస్తావన తీసుకురావడం వల్ల పార్టీకే నష్టం అవుతుందని గట్టిగా సూచించినట్లు ఏపీ కాంగ్రెస్ పార్టీలో టాక్. ఇదే తరుణంలో శైలజానాథ్ చేసిన వ్యాఖ్యల పట్ల కొంత మంది వైసీపీ నాయకులు అసలు వైఎస్ బతికి ఉంటే మీ నాయకురాలు సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించే దమ్ము ఉండేదా అంటూ కౌంటర్లు వేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version