పాపం.. విజయ్ దేవరకొండ సినిమా పరిస్థితి ఇలా అయిపోయిందేంటి..?

-

విజయ్ దేవరకొండ.. వ‌చ్చిన అతి త‌క్కువ వ్య‌వ‌థిలోనే హీరోగా మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను న‌టించిన చిత్రాల్లో ఏడు మాత్ర‌మే విడుద‌ల‌య్యాయి. అందులో పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి, గీత గోవిందం సినిమా సూప‌ర్‌సక్సెస్‌ల‌య్యాయి. మిగిలిన చిత్రాలేవీ ఆద‌ర‌ణ పొంద‌క‌పోయినా విజ‌య్‌కి యూత్‌లో క్రేజ్ త‌గ్గలేదు. ఇక ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ‌, క్రాంతిమాధవ్ కాంబినేషన్‌లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఎన్నో అంచనాల మధ్య ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. మొదటి షో నుండే నెగెటివ్ టాక్ తో నడిచిన ఈ చిత్రం భారీ నష్టాల దిశగా వెళుతుంది. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం విడుదలై వారం గడిచిపోయింది.

టాక్ ఏమాత్రం ఆశాజనకంగా రాకపోవడంతో ఇక విజయ్ ఖాతాలోకి హ్యాట్రిక్ డిజాస్టర్ నమోదు అయ్యిపోయింది. అయితే ఈ చిత్రం ఇప్పటికే 20 కోట్లు నష్టాన్ని మిగల్చడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెప్తుండగా ఈ సినిమా పరిస్థితి థియేటర్స్ లో ఎంత దారుణంగా ఉందో సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ చూస్తే అర్ధం అవుతుంది. ఎన్నో అంచనాలను నెలకొల్పుకున్నా ఈ చిత్రంపై కొన్ని థియేటర్స్ వారు ఒక ఆఫర్ పెట్టారు. ఒక టికెట్ కొంటె ఇంకో టికెట్ ఉచితం అంటూ కొన్ని పేపర్ ప్రకటనలు కూడా ఇవ్వడంతో విజయ్ రేంజ్ ఈ స్థాయికి పడిపోయిందా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version