దందాల తలసాని.. పనేదైనా-పథకమైదైనా నా వాటా 30 శాతం.. కాంగ్రెస్‌ ఛార్జ్‌ షీట్‌

-

నేడు కాంగ్రెస్ పార్టీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు వ్యతిరేకంగా ఒక ‘ఛార్జ్ షీట్’ విడుదల చేసి అందరిని షాక్ కి గురి చేసింది. ‘దందాల తలసాని.. పనేదైనా-పథకమైదైనా నా వాటా 30 శాతం’ అంటూ ఈ ఛార్జ్ షీట్ లో వెల్లడించింది కాంగ్రెస్. తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను తరిమికొడదాం.. సనత్ నగర్ నియోజకవర్గాన్ని కాపాడుదాం బై బై శ్రీనివాస్ యాదవ్ అనే నినాదాలతో మొత్తం 9 అంశాలతో కూడిన ఛార్జిషీట్ పత్రాన్ని తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్‌లో రిలీజ్ చేసింది. అయితే విడుదల చేసిన ఈ ఛార్జిషీట్‌లో పలు తలసాని పై చాలానే ఆరోపణలు చేసింది కాంగ్రెస్. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి నెక్లెస్ రోడ్డులోని థ్రిల్ సిటీ ప్రాజెక్టును 99 ఏళ్ల లీజుకు తన కుమారుడు సాయి కిరణ్ యాదవ్‌కు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు కట్టబెట్టారు.

Talasani asks Film Chamber to resolve issues of cine workers
ఆ ప్రాజెక్ట్ ద్వారా కోట్లు కొల్లగొట్టేందుకు పథకం పన్నినట్లు వెల్లడించింది. అంతే కాక, తలసాని సాయికిరణ్ యాదవ్, అతని స్నేహితులు 2022లో హోలీ వేడుకల సందర్భంగా సినీ నటి కుమార్తె సుప్రీతపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని. దీనిపై రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి తల్లి ఫిర్యాదు చేస్తే మంత్రి వాళ్లను బెదిరించి తన కొడుకు దుశ్చర్యను బయటకు రాకుండా సెటిల్ చేసినట్లు ఆ ఛార్జ్ షీట్ లో తెలియపరిచింది. సొంత నియోజకవర్గంతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యే క్వార్టర్స్, మల్లాపూర్, గచ్చిబౌలి చుట్టుపక్కల విల్లాలు, అపార్టుమెంట్లలో మంత్రి ఆయన సోదరులు క్యాసినో గ్యాంబ్లింగ్ లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని వీటిపై ఎవరైనా ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే వారిని బెదిరిస్తున్నారని ఆ ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ తెలియపరిచింది.

ఇకపోతే, సనత్ నగర్ నియోజకవర్గంలో మంత్రి, ఆయన సోదరులు రౌడీ దర్బార్ నడుపుతున్నారు. మంత్రి, ఆయన సోదరులు తలసాని ధర్మేంద్ర, తలసాని మహేష్ యాదవ్‌ల ద్వారా 2019లో మనీలాండరింగ్ లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు అని ఈ ఛార్జ్ షీట్ లో వెల్లడిపరిచింది. సనత్ నగర్ బ్రిడ్జి పరిధిలో తమ అనుచరుల ద్వారా గంజాయి మాఫియాను నడుపుతూ భారీగా లావాదేవీలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తలసాని నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండకుండా మారేడ్‌పల్లిలోని తన బంగ్లాలో సేదతీరుతూ కాలక్షేపం చేస్తున్నాడని. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆయన బంగ్లాకు వెళ్లి గంటలు తరబడి బయటే వేచి చూసినా ఎమ్మెల్యే అసలు ఏమి జరగనట్టే ఉన్నదంటూ తెలిపింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news