కోకాపేట ఈ -వేలం బిడ్డింగ్‌లో ఎమ్మెల్సీ కవిత బినామీ.. కాంగ్రెస్‌ ఫిర్యాదు

-

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ అన్నట్లు ఆ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే.. కోకాపేట, బద్వేల్ భూముల వేలం పాటలో సీఎం కేసీఆర్ కుటుంబం భారీగా అక్రమాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఈడీకి ఫిర్యాదు చేశారు. కోకాపేట ఈ -వేలం బిడ్డింగ్‌లో ఎమ్మెల్సీ కవిత బినామీ ఉన్నారని, బద్వేల్ భూముల వేలంలో మంత్రి కేటీఆర్‌తో అవగాహన ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు మాత్రమే పాల్గొనేలా హెచ్‌ఎండీఏ అధికారులు అవకాశం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కోకాపేట భూములు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి 11 ఎకరాలు కేటాయించిన ప్రాంతానికి సమీపంలోనే ఉన్నాయని, అలాగే 111 జీవోకు సమీపంలోనే ఉన్నాయని ఆరోపించారు. అనేక కేసులు కోర్టుల్లో పెండింగ్ ఉన్న కాంట్రాక్టర్లు ఈ బిడ్ ప్రక్రియలో పాల్గొన్నారని అందువల్ల ఈ భూముల వేలంలో పాల్గొన్న కంపెనీల అసలు కథ ఏంటీ వీటి వెనుక ఉన్నదెవరో విచారణ జరిపాలని ఈడీని కోరారు. బినామీ లావాదేవీలను అరికట్టడంతో పాటు సంఘ విద్రోహ కార్యకలాపాలను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో మ‌ళ్లీ భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధికారంలోకి వ‌స్తుంద‌ని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత అన్నారు. “ప్రజల ఆశీస్సులతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలను తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ” అని బీఆర్‌ఎస్ లీడ‌ర్ పేర్కొన్నారు. వివ‌రాల్లోకెళ్తే.. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) మూడోసారి అధికారాన్ని నిలుపుకుంటుందని ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు, ముఖ్యంగా టైర్ టూ, టైర్ త్రీ నగరాలకు పరిశ్రమలను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అనిఅన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version