కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు అమలు చేసేలా ఉద్యమం చేస్తా : కొప్పుల ఈశ్వర్

-

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పెద్దపల్లి బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చెప్పారు.మంగళవారం పెద్దపల్లి జిల్లాలో మీడియా సమావేశంలో కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు అమలాయ్యేంత వరకు ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని వెల్లడించారు.

సింగరేణి కార్మికులకు ఐటీ మినహాహింపు, కాంట్రాక్ట్‌ కార్మికులకు హైపవర్ వేతనాలు సాధించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ బీఆర్ఎస్ సైనికులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఎన్నికలతో సంబంధం లేకుండా నిత్యం ప్రజా సమస్యలపై ఉద్యమిస్తానని ఆయన స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news