రైతు బంధు రద్దు చేయాలని కాంగ్రెస్ చూస్తోంది : హరీశ్ రావు

-

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని చూస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ‘రైతు బంధు కంటే సన్నరకం ధాన్యానికిచ్చే రూ.500 బోనస్ మేలు అని రైతులు అంటున్నారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అంటున్నారు. 5,19,605 క్వింటాళ్ల సన్న వడ్లకు దక్కిన బోనస్ రూ.26 కోట్లు అయితే..

అదే రైతు బంధు కింద ఏడాదికి రూ.7500 రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. మరి రైతు బంధు కంటే బోనస్ అందించడం రైతులకు ఎలా మేలు చేస్తుంది’ అని హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులను రేవంత్ సర్కార్ మోసం చేస్తోందని, వారికి రైతుబంధు శాశ్వతంగా ఎగ్గొట్టడానికి చూస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ఆరోపించారు. కాగా, రైతులకు బోనస్ సైతం పూర్తిగా చెల్లించలేదని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version