కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ మళ్ళీ అధికారాన్ని దక్కించుకోవడం కోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. కాగా ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకురాలు మరియు సినీ నటి రమ్య కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా రమ్య మాట్లాడుతూ, “బీజేపీలో చేరితే కేవలం ఒక్క రోజులోనే నన్ను మంత్రిని చేస్తానని బీజేపీ నాకు ఆఫర్ ఇచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈమె ఆ నేత ఎవరన్నది చెప్పకపోయినా ఇది చాలా ముఖ్యమైన అంశం అని చెప్పాలి.
ఇందుకు నటి రమ్య ఒప్పుకోలేదని తెలిపింది, పైగా ఈమె చెబుతూ బీజేపీ అంటే నాకు వ్యతిరేకత లేకపోయినా .. ఈ పార్టీలో ఉన్న కొందరి నాయకుల సిద్ధాంతాలు నాకు నచ్చవని పేర్కొంది. ఈ వ్యాఖ్యలను మంత్రి అశోక్ ఖండించారు.