IPL 2023 : బాలీవుడ్ హీరోయిన్ కు కోహ్లీ ముద్దుల వర్షం

-

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ 2023లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్లలో 6 వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగుల‌కే ప‌రిమితం కావ‌డంతో బెంగ‌ళూరు 7 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

ఇక రాజస్థాన్ ఇన్నింగ్స్ సందర్భంగా కోహ్లీ చేసిన ఒక చర్య సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.విషయంలోకి వెళితే… ఇన్నింగ్స్ 14వ ఓవర్ హర్షల్ పటేల్ వేశాడు. ఆ ఓవర్ లో నాలుగో బంతిని జైస్వాల్ ప్రయత్నించాడు. హర్షల్ వేసిన ఫుల్ టాస్ బంతిని లాంగాన్ దిశ గా ఆడాడు. అక్కడే ఉన్న కోహ్లీ చేతుల్లో సురక్షితంగా పడింది. అంతే కోహ్లీ స్టాండ్స్ లో ఉన్న తన భార్య అనుష్కకు ఫ్లైయింగ్ కిస్ లు ఇవ్వడం ఆసక్తి కలిగించింది. అంతేకాదు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news