కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని హామీ ఇచ్చింది. హామీ పై కాంగ్రెస్ పార్టీ లోనే భిన్న స్వరాలు వినపడుతున్నాయి. కుల గణన ముందుకు తీసుకురావడం అంటే ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ ల వారసత్వాన్ని అవమానించినట్లేనని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు.
చారిత్రక నేపథ్యము వున్నా కాంగ్రెస్ ఇచ్చిన కులగణన హామీ అనేక మందిని ఆందోళన కలిగిస్తోంది అని అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు గుర్తింపు రాజకీయాలకి పాల్పడలేదు ఇది ప్రజాస్వామ్యానికి హానికరం అని అన్నారు ఈ విషయం గురించి మళ్ళీ ఆలోచించాలని లేఖలు వ్రాశారు పార్టీకి చెందిన కొంతమంది సభ్యులు కూడా చాలా కాలంగా కుల ఆధారిత రాజకీయాలని అనుసరించారు.