వీడియో వైరల్ : కేటీఆర్ ఇచ్చిన మాస్కు ధరించి ఉంటే ఇలా జరిగేది కాదు..!

-

mla t padma rao
mla t padma rao

కరోనా మహమ్మారి పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరినీ కాటు వేస్తుంది. ఎన్ని కఠిన నిబంధనలు పాటిస్తే ఈ వ్యాధిని అంతగా అరికట్టవచ్చు. నియమాలను ఉల్లాఘించి బాధ్యతలకు విరుద్ధంగా ప్రభుత్వాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించకతప్పదు. పెద్ద పెద్ద నాయకులు సినీ ప్రముఖులు ఎన్నో కఠిన చర్యలు చేపట్టినా ఈ వ్యాధి బారిన నుండి తప్పించుకోలేకపోతున్నారు, వారిని కూడా ఈ వ్యాధి సతమతపెడుతుంది.

తాజాగా తెలంగాణ రాష్ట్రా హోం మంత్రి మహమూద్ అలీ,   డిప్యూటీ స్పీకర్ టీ పద్మారావు ఈ వ్యాధికి గురయ్యారు. అయితే కాంగ్రెస్ నేతలు ఓ వీడియో పోస్ట్ చేశారు.. ఆ వీడియోలో డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే పద్మా రావు మంత్రి కేటీఆర్ లు ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పద్మారావుకు మాస్క్ ఇస్తే పద్మారావు ఆ మస్కును ధరించకుండా తన జేబులో పెట్టుకున్నాడు. కేటీఆర్ ఆ మాస్కును ధరించమంటే కూడా పద్మారావు ధరించలేదు. ఆ కార్యక్రమం జరిగిన కొన్ని రోజులకే పద్మారావు కరోనా బారిన పడ్డారు. మాస్క్ ధరించి ఉండుంటే ఈ పరిస్థితి అసలు వచ్చేదా..? అయ్యో ఎంత పనైపోయిందే అంటూ కాగ్రేస్ వర్గాలు ఆ వీడియోను పోస్ట్ చేశాయి. తెలంగాణ ప్రభుత్వం లోని నాయకులే మాస్కూలు ధరించకపోతే ఇక ప్రజలు ఎలా ధరిస్తారు అంటూ వారు వ్యంగ్యాస్త్రాలను వదులుతున్నారు.  ఆ వీడియో పోస్ట్ చేసిన కొంతసేపటికే ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు మాస్క్ ధరించాలి అంటూ లేదా ఇలాగే అవుతుందని తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఎంత పనైపోయే! కేటీఆర్ ఇచ్చిన మాస్క్ ను మడిచి జేబులో పెట్టుకోకుండా, కట్టుకొని ఉంటే కరోనా సోకపోవునేమో!?👇

Posted by Share Telangana on Wednesday, 1 July 2020

కరోనా సంక్రమణ తారా స్థాయికి చేరుకుంది. ప్రతీ నిమిషం వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతీ ఒక్కరూ బాధ్యతారహితంగా వ్యవహరించి ఈ వ్యాదితో పోరాడాలి. వైద్యులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు… ప్రతీ ఒక్కరికీ చేతులెత్తి వేడుకుంటున్నాయి…! ప్రతీ ఒక్కరూ మాస్క్ లను ధరించాలి సోషల్ డిస్టెన్సింగ్ వ్యక్తిగత శుభ్రత పాటించాలి ఇది మనందరి బాధ్యత. కరోనాతో పోరాడే బాధిత ప్రతీ ఒక్కరిది కేవలం ప్రభుత్వాలదే కాదు అని ప్రతీ ఒక్కరూ గుర్తించాలి. ఈ నియమాలను పాటించడం వల్లా మనం ఒక్కరమే కాదు మన కుటుంబాలు కూడా వ్యాధి నుండి రక్షింపబడతాయి. దయచేసి అందరూ నియమాలను తప్పక పాటించండి. మీ కుటుంబాల గురించి ఆలోచించండి.. వ్యాదిని ఇంటికి తీసుకెళ్లకండీ…!   ప్రభుత్వ నియమాలను పాటిద్దాం కరోనాను అరికతడదాం…!

Read more RELATED
Recommended to you

Latest news