బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదు.. ఉంటే ఉండు లేకుంటే వెళ్లిపో: కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

-

కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీరు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. ఇది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదు.. ఉంటే ఉండు లేకుంటే వెళ్లిపో, గెట్‌లాస్ట్‌ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జడ్పీటీసీ శేఖర్‌గౌడ్‌పై ఫైర్ అయ్యారు. ప్రొటోకాల్‌ ప్రకారం సీటు అడిగిన జడ్పీటీసీ శేఖర్‌గౌడ్‌ పై నోరు పారేసుకున్నారు మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ఇది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదు అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్నారు.

కింద కూర్చుంటే కూర్చో లేకుంటే వెళ్ళిపో గెట్‌లాస్ట్‌ అని శేఖర్‌గౌడ్‌పై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అరిచారు. నేను గొడవ పెట్టుకోవడానికి రాలేదు. ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి సర్వసభ్య సమావేశానికి రావడం తో వెల్‌కమ్‌ చెప్పడానికి వచ్చానని అన్నారు జడ్పీటీసీ శేఖర్‌గౌడ్‌ను. అయినా కూడా బలవంతంగా పోలీసులతో బయటకు పంపేశారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version