కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

-

ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. 45 మందితో రెండో జాబితాను ఆపార్టీ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. 55 మందితో ఇటీవల తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య వందకు చేరింది. ఇంకా 19 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇటీవల కాంగ్రెస్లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రేవూరి ప్రకాశిరెడ్డి కి రెండో జాబితాలో అవకాశం కల్పించారు.అభ్యర్థుల జాబితా…

1. రావి శ్రీనివాస్- సిర్పూర్
2. అజ్మీరా శ్యామ్- ఆసిఫాబాద్
3. వెడమ బొజ్జు- ఖానాపూర్
4. కంది శ్రీనివాస్ రెడ్డి- ఆదిలాబాద్
5. వెన్నెల అశోక్- బోధ్
6. నారాయణరావు పాటిల్- ముథోల్
7. మదన్ మోహన్ రావు- ఎల్లారెడ్డి
8. భూపతిరెడ్డి- నిజామాబాద్ రూరల్
9. జువ్వాడి నరసింగరావు- కోరుట్ల
10. మేడిపల్లి సత్యం- చొప్పదండి
11. వడితల ప్రణవ్- హుజూరాబాద్
12. పొన్నం ప్రభాకర్- హుస్నాబాద్
13. పూజల హరికృష్ణ- సిద్ధిపేట
14. ఆవుల రాజిరెడ్డి- నర్సాపూర్
15. చెరుకు శ్రీనివాస్ రెడ్డి- దుబ్బాక
16. బండి రమేశ్- కూకట్ పల్లి
17. మధుయాష్కీ గౌడ్- ఎల్బీనగర్
18. మల్ రెడ్డి రంగారెడ్డి- ఇబ్రహీంపట్నం
19. కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి- మహేశ్వరం
20. కస్తూరి నరేందర్- రాజేంద్రనగర్
21. జగదీశ్వర్ గౌడ్- శేరిలింగంపల్లి
22. మనోహర్ రెడ్డి- తాండూరు
23. రోహిన్ రెడ్డి- అంబర్ పేట్
24. విజయారెడ్డి- ఖైరతాబాద్
25. మహ్మద్ అజారుద్దీన్- జూబ్లీహిల్స్
26. జీవీ వెన్నెల- సికింద్రాబాద్ కంటోన్మెంట్
27. వాకిటి శ్రీహరి- మక్తల్
28. చిన్నారెడ్డి- వనపర్తి
29. బాలూ నాయక్- దేవరకొండ
30. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి- మునుగోడు
31. కుంభం అనిల్ కుమార్ రెడ్డి- భువనగిరి
32. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి- జనగామ
33. యశస్విని- పాలకుర్తి
34. మురళీ నాయక్- మహబూబాబాద్
35. రేవూరి ప్రకాశ్ రెడ్డి- పరకాల
36. నాయిని రాజేందర్ రెడ్డి- వరంగల్ వెస్ట్
37. కొండా సురేఖ- వరంగల్ ఈస్ట్
38. నాగరాజు- వర్ధన్నపేట
39. పాయం వెంకటేశ్వర్లు- పినపాక
40. ఖమ్మం- తుమ్మల నాగేశ్వరరావు
41. పొంగులేటి శ్రీనివాసరెడ్డి- పాలేరు
42. పరిణికా రెడ్డి- నారాయణపేట్
43. యెన్నం శ్రీనివాస్ రెడ్డి- మహబూబ్ నగర్
44. అనిరుధ్ రెడ్డి- జడ్చర్ల
45. మధుసూదన్ రెడ్డి- దేవరకద్ర

ఇది ఇలా ఉంటె, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇటీవల 52 మందితో తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ నేడు రెండో జాబితా విడుదల చేసింది. అత్యంత ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరుంది. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఏపీ మిథున్ కుమార్ రెడ్డి పేరును బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. మిథున్ కుమార్ రెడ్డి మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి కుమారుడు. జితేందర్ రెడ్డి 1999లో బీజేపీ ఎంపీగా గెలిచారు. 2014లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచారు. 2019లో ఆయన బీజేపీలోకి తిరిగొచ్చారు. ఈసారి తన రాజకీయ వారసుడిగా కుమారుడికి బీజేపీ టికెట్ ఇప్పించుకోవడంలో జితేందర్ రెడ్డి కృషి ఫలించింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version