సోనియా గాంధీ కీలక సమావేశం… పార్టీ నేతలతో పాటు ఎన్నికల వ్యూహకర్త పీకే హాజరు

-

కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఢిల్లీ పెద్దలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఆకస్మికంగా సోనియా గాంధీతో పార్టీ కీలక నేతలు భేటీ అయ్యారు.కాంగ్రెస్ నేతలు అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్ ఢిల్లీలోని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నివాసానికి చేరుకున్నారు. రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. 

వీరితో పాటు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఈభేటీలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ కు పని చేసేందుకు ఒప్పుకున్నారు. గుజరాత్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరుపున పనిచేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇటు ప్రశాంత్ కిషోర్, అటు కాంగ్రెస్ పార్టీ పలు మార్లు చర్చలు కూడా జరిపారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తరువాత పార్టీలో మార్పులు చేసేందుకు ఏఐసీసీ సిద్ధం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version