దేశాన్ని లూటీ చేయడమే కాంగ్రెస్ ట్రాక్ రికార్డు : ప్రధాని మోడీ

-

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ…’కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వద్దని తెలంగాణ అంటోంది. బీజేపీకి మాత్రమే ఓటు వేస్తామంటోంది. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్ ఇచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉంది. జూన్ 4న దేశం గెలుస్తుంది. శత్రువులు ఓడిపోతారు’ అని ధీమా వ్యక్తం చేశారు.

దేశాన్ని లూటీ చేయడమే కాంగ్రెస్ ట్రాక్ రికార్డు అని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ లో ఎన్నో చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడి వద్ద బాంబు పేలింది. వారి పాలనలో పార్కు, గుడికి వెళ్లాలన్నా, బస్సు ఎక్కాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఉండేది అని మండిపడ్డారు. కానీ ఎన్డీఏలో ఇలాంటివి ఎప్పుడైనా వినిపించాయా? గత పదేళ్లలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించాం’ అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news