కారుతో కాంగ్రెస్: సెట్ చేస్తున్న ఏపీ నేత?

-

ఏంటో ఏపీ రాజకీయాలు మాదిరిగా తెలంగాణ రాజకీయాలు ఓ పట్టాన అర్ధం అవ్వడం లేదు…ఏపీలో శత్రువులు ఎవరు? మిత్రులు ఎవరు? అనేది క్లారిటీ వస్తుంది గాని, తెలంగాణ రాజకీయాల్లో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఏపీలో టీడీపీ-వైసీపీలు శత్రువులుగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే జనసేన-టీడీపీకి దగ్గరగా ఉంది..అవసరమైతే టీడీపీతో పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉంది..ఇందులో ఫుల్ క్లారిటీ ఉంది.

 

కానీ తెలంగాణలో ఎవరు ఎవరికి శత్రువులు, ఎవరు ఎవరికి మిత్రులు అనేది మాత్రం తెలియడం లేదు. ఎందుకంటే ఇక్కడ త్రిముఖ పోరు జరుగుతుంది. టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్య పోరు నడుస్తోంది. కాంగ్రెస్ ఎలాగో టీఆర్ఎస్, బీజేపీలకు శత్రువుగా ఉంది..బీజేపీ సైతం టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు శత్రువుగా ఉంది. టీఆర్ఎస్ సైతం ఆ రెండు పార్టీలతో ఫైట్ చేస్తుంది. కానీ అంతర్గతంగా టీఆర్ఎస్-బీజేపీలు ఒక్కటే అని కాంగ్రెస్ అంటుంది. మొన్నటివరకు టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అలాగే ప్రచారం చేసుకుంటూ వచ్చారు.

అయితే తాజాగా కేసీఆర్ రాజకీయంతో మొత్తం సీన్ మారింది…గత రెండు రోజుల నుంచి కేసీఆర్…బీజేపీపై నాన్ స్టాప్ యుద్ధం చేస్తున్నారు. బీజేపీని ఏకీపారేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ఇటీవల రాహుల్ గాంధీ గురించి అసోం బీజేపీ సీఎం హిమంత విశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సర్జికల్ స్ట్రయిక్స్‌ గురించి రాహుల్ ప్రశ్నించారని చెప్పి, రాహుల్ జననం గురించి విశ్వశర్మ ప్రశ్నించారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది.

దీనిపై కేసీఆర్ కూడా ఫైర్ అయ్యారు…రాహుల్‌కు మద్ధతుగా నిలుస్తూ..బీజేపీ సీఎంపై మండిపడ్డారు. ఇలా రాహుల్‌కు సపోర్ట్‌గా నిలవడంతో..ఇంకా కేసీఆర్, కాంగ్రెస్‌తో కలుస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. దీన్ని బీజేపీ మరింత ప్రచారం చేయడం మొదలుపెట్టింది. టీఆర్‌ఎస్‌తో పొత్తుకు కాంగ్రెస్‌ తహతహలాడుతుందని, ఇందుకు ఏపీకి చెందిన కీలక నేత ఒకరు మధ్యవర్తిత్వం చేస్తున్నారని బీజేపీ విమర్శిస్తుంది. ఇక రెండు పార్టీల మధ్య కుదిరిన చీకటి ఒప్పందాన్ని కేసీఆర్‌..తన మాటలతో బయటపెట్టారని అంటున్నారు. మరి ఎవరు ఎవరితో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారో క్లారిటీ లేదనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version