పంజాబ్‌లో మరోసారి రైలు ప్రమాదానికి కుట్ర..

-

దేశంలో రైలు ప్రమాదాలకు వరుస కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల రైలు ట్రాకులపై గ్యాస్ సిలిండర్లు, సిమెంట్ దిమ్మెలు దర్శనం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలు మరువక ముందే తాజాగా పంజాబ్‌లోని బఠిండాలో రైలు ప్రమాదానికి మరోసారి కుట్ర జరిగింది.గూడ్స్ రైలు వెళ్లాల్సిన రైల్వే ట్రాక్‌పై ఇనుప రాడ్లు కనిపించాయి.లోకోపైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తెల్లవారుజామున 3 గంటలకు బటిండా-ఢిల్లీ రైల్వే ట్రాక్ మీదుగా గూడ్స్ రైలు వెళ్తోంది.అయితే, రైల్వే ట్రాక్ పై ఇనుప రాడ్లు ఉండటంతో పట్టాల మధ్యలో రైలుకు సిగ్నల్ అందలేదు. దీంతో, ట్రైన్ చాలా ఆలస్యమైంది’ అని ఇన్వెస్టిగేటింగ్ అధికారి శవీందర్ కుమార్ తెలిపారు.ఇప్పటివరకు 9 ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.కాగా, ఈనెలలో ఇది నాలుగో ఘటన అని అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version