దేశంలో 200 ఎయిర్ పోర్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర పౌరవిమానయాన శాఖమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో వేగంగా చిన్న, పెద్ద ఎయిర్ పోర్టుల నిర్మాణానికి కసరత్తు జరుగుతోందన్నారు. రానున్న 20 ఏళ్లలో దేశంలో 200కు పైగా ఎయిర్ పోర్టులు వస్తాయన్నారు. మంగళగిరిలో నిర్వహించిన డ్రోన్ సమ్మిట్-2024లో భాగంగా ఆయన మాట్లాడారు.
గత పదేళ్లలో ఎయిర్ పోర్టుల సంఖ్య 74 నుంచి 157కు పెరిగిందన్నారు. చంద్రబాబు ఐడియాలజీని అందుకోవడం తనకు కష్టంగా మారిందని తెలిపారు. విజన్ 2020తో పెను మార్పులు తీసుకొచ్చారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు చంద్రబాబు ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. కాగా, ఏపీలోని మంగళగిరిలో నిర్వహించిన డ్రోన్ సమ్మిట్‌కు భారీగా రెస్పాన్స్ వస్తోంది.