4 గురు గురుకుల విద్యార్థులకు కరెంటు షాక్..హరీష్ రావు మండిపాటు!

-

నలుగురు గురుకుల విద్యార్థులకు కరెంటు షాక్ తగలి గాయాల పాలైన ఘటన పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిబ్బంది నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నదని…ప్రభుత్వ పట్టింపులేని తనం పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నదని ఆగ్రహించారు. మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ గురుకులానికి చెందిన నలుగురు విద్యార్థినులు కరెంట్ షాక్ తగిలి గాయాల పాలవడం దురదృష్టకరం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.

harish raoon gurukula

 

తక్షణం స్పందించి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని చేప్పారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లు, ఫుడ్ పాయిజన్ కేసులు సర్వసాధారణం కాగా, ఇప్పుడు ఆ జాబితాలో కరెంట్ షాకులు చేరాయన్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని, గాడి తప్పిన గురుకులాలను బాగు చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news