కంటైనర్ లారీ బోల్తా.. లక్డీకాపుల్, సెక్రెటేరియట్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

-

హైదరాబాద్‌‌లోని లక్డీకాపుల్,సెక్రెటేరియట్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.కంటైనర్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.మూసాపేట్‌ నుంచి కాటేదాన్ వెళ్తున్న లారీ ఉదయం లక్డికాపూల్‌లో టర్నింగ్‌ వద్దకు రాగానే బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో రోడ్డుపై ఎక్కువగా వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు మాత్రం స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.రోడ్డుకు ఒకవైపు కంటైనర్ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్‌లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడినట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంలో నిమగ్నం అయ్యారు. వేరే రూట్లోకి వాహనాలను మళ్లించారు.బోల్తాపడిన లారీని భారీ క్రేన్ సహాయంతో తొలగించే ప్రయత్నం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news