టాస్క్ ల కోసం వెనకాడని కంటెస్టెంట్స్..!

-

మా టీవీలో ప్రసారం అయ్యే బిగ్‌ బాస్ షో బుల్లితెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ 4 వ సీజన్‌ ఇప్పటికే ఆరవ వారం కూడా చేరుకుంది. అయితే ఈ వారం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్క్ లను అందరు కలిసి టీమ్ వర్క్ లాగా ఉండి షో ను ముందుకు నడిపించారు. అంతకు ముందు ఇచ్చిన టాస్క్‌లలో టీమ్స్‌గా విడగొట్టినా వ్యక్తిగతంగా ఎవరి ఆట వారు ఆడటానికే ఇష్టపడేవారు. వేరే వాళ్ళ ఆటలో ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు. కానీ, ఈసారి మాత్రం టీమ్ కోసం ఎంత కష్టమైనా సరే త్యాగాలు చేసేందుకు సిద్ధపడుతుండటం ఆసక్తిగా మారింది ప్రేక్షకులకు.. ఈ వారం బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చాడు. ఆటలో భాగంగా టీమ్ ను బ్లూ, రెడ్ టీమ్‌ లుగా విడగొట్టాడు. బ్లూ టీమ్‌లో దేత్తడి హారిక జుట్టు కత్తిరించుకోని ఎరుపు రంగు వేసుకుంటుంది. అలాగే కుమార్ సైతం తన ఒంటి మీద ఉన్న బట్టలు చింపుకోవడంతో పాటు ఎక్కువ సేపు ఇసుక బస్తాను గాలిలో నిలిపి టీమ్ వర్క్ చేసాడు.

ఇకపోతే రెడ్ టీమ్‌లో అభిజిత్ తనకు సంబంధించిన అన్ని వస్తువులను బయటకు పంపించేయగా, లాస్య అన్ని రకాల ఆహార పదార్దాల డ్రింక్‌ ను తాగి రెడ్ టీమ్ ను గెలిపించింది. ఇక మోనాల్ అయితే జనపనార బట్టలను ధరించింది. దీంతో ఇప్పటివరకు రెండు టీమ్‌లు చెరో మూడు డీల్స్ పూర్తి చేశాయి. ఈరోజు బిగ్‌బాస్ వారికి మరిన్ని డీల్స్ ఇవ్వనున్నాడు.

అందులో భాగంగా.. ఒకరు తల, గడ్డం సగం షేవింగ్ చేసుకోవాలని చెప్పాడు. ఇందుకు అమ్మ రాజశేఖర్ తాను సిద్ధమంటూ ముందుకు వచ్చాడు. ఇదిలా ఉంటే ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం బ్లూ టీమ్ విజయం సాధించిదని ప్రచారం జరుగుతుంది. మరి రెడ్ టీమ్ గెలుస్తుందా..? లేక బ్లూ టీమ్ గెలుస్తుందా..? ఎవరు కెప్టెన్ అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి ఉండాలిసిందే మరి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version