బుచ్చయ్య చౌదరి ప్రయత్నం ఫలించేనా…!

-

టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఉండి అత్యంత సీనియర్ గా ఉన్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఒక పోస్టు మాత్రం దక్కడం లేదు.పార్టీ అత్యున్నత కమిటీ అయిన పొలిట్ బ్యూరోలో ఇంతవరకు అవకాశం దక్కించుకోలేక పోయారు బుచ్చయ్య.

టిడిపి పొలిట్ బ్యూరోలో ఒక్క చిత్తూరు జల్లా నుంచే నలుగురు సభ్యులు ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ తో పాటు గల్లా అరుణ కుమారి, గల్లా జయదేవ్ పొలిట్ బ్యూరో లో ఉన్నారు. అయితే కొద్దిరోజుల క్రితమే గల్లా అరుణ కుమారి పొలిట్ బ్యూరో నుంచి వైదొలిగారు. వ్యక్తి గత కారణాలు, వయో భారం అని ఆమె ప్రకటించినా….ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పొలిట్ బ్యూరోలో ఉండడంపై అభ్యంతరాలు ఉన్నాయి.ఎంపి గల్లా జయదేవ్ లోక్ సభ ఫ్లోర్ లీడర్ హోదాలో పొలిట్ బ్యూరోలో ఉన్నారు. దీంతో గల్లా అరుణ బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది.

తాజా పరిణామాల నేపథ్యంలో కమ్మ వర్గం నుంచి ఒకరికి పొలిట్ బ్యూరోలోకి అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే బుచ్చయ్యకు చాన్స్ ఇస్తారని తెలుస్తోంది. అయితే వీరితో పాటు పయ్యావుల, దూళిపాళ్ల పేర్లు కూడా పరిశీనలలో ఉన్నాయి. కానీ సీనియారిటీ రీత్యా బుచ్చయ్య కు ఈ సారి చంద్రబాబు అవకావం ఇస్తారని పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. గోరంట్ల కూడా పార్టీ కోసం అత్యంత నిబద్దతతో ఉన్న నేతగా గుర్తింపు పొందారు. ఈ వయసులో కూడా పార్టీ కార్యక్రమాల్లో నిత్యం పాల్గొంటూ తనదైన ముద్ర వేస్తున్నారు. యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న వారిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version