ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసారు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఇటీవల రాహుల్ సిప్లిగంజ్ కు రూ. కోటి నగదు ప్రోత్సాహకం అందించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. కాగా ఇటీవలే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా ప్రకటించారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు..’ పాట ద్వారా ఆస్కార్ స్థాయి వరకు ఎదిగారు రాహుల్ సిప్లిగంజ్.