తెలంగాణ విద్యార్థులకు రాగి జావా.. వచ్చే ఏడాది నుంచి పంపిణి

-

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త అందింది. విద్యార్థులకు రాగి జావను అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. చాలా రోజులుగా పెండింగ్ లో ఈ కార్యక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు.

గడిచిన సంవత్సరం ప్రయోగాత్మకంగా పరిశీలించిన జావ కార్యక్రమాన్ని 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అందించనున్నారు. శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ భాగస్వామ్యంతో ప్రారంభం కానుంది. దీని ద్వారా సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

ఇక అటు ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని టూరిజం హబ్ గా తయారు చేస్తామని ప్రకటించారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ భూములు ఇష్టానుసారంగా అనర్హులకు ధారాదత్తం చేశారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వాటిపై సమీక్షలు చేస్తున్నామని తెలిపారు. వేయి కోట్ల విలువైన భూముల ను రిటర్న్ తీసుకున్నాం.. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర గోల్ఫ్ కోర్ట్ అభివృద్ధి చెస్తాం అని 120 ఎకరాలు తీసుకున్నారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version