ఈరోజుల్లో జనాలు ఉరుకులు పరుగులు జీవితాన్ని గడుపుతున్నారు..ఎప్పుడో సమయం దొరికితే ఫ్యామిలితో ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళు కొత్తగా ట్రిప్ చేసుకోవాలనుకుంటే మాత్రం సముద్ర ప్రయాణం బెస్ట్..ఆహ్లాదకరమైన వాతావరణం తో ఇంటిల్లి పాధి సంతోషంగా ఎంజాయ్ చేయవచ్చు.అలా సముద్ర విహారానికి వెల్లాలని భావించే వారికి గుడ్ న్యూస్..కార్డీలియా క్రూయిజ్ షిప్ బుధవారం ఉదయాన్నే విశాఖపట్నం చేరుకుంది. ఈ లగ్జరీ క్రూయిజ్ చెన్నైై విశాఖ నగరాల మధ్య పర్యాటకులకు నూతన అనుభూతిని కలిగించనుంది. ఈ షిప్ మూడు రాత్రులు, నాలుగు పగళ్లతో కూడిన ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది. ఈ లగ్జరీ కార్డీలియా క్రూయిజ్ టికెట్లు ప్రస్తుతం హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
ఇప్పుడు ఈ షిప్ చెన్నై నుంచి విశాఖకు చేరుకుంది.ఈ షిప్‌లో 1900 మందికిపైగా పర్యాటకులు వైజాగ్ చేరుకున్నారు. ఈ క్రూయిజ్.. విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై వరకు వెళ్లి.. తిరిగి వైజాగ్ చేరుకుంటుంది.. కార్డీలియా క్రూయిజ్ కంపెనీ నడిపే ఈ షిప్.. సముద్రంలో తేలియాడే స్టార్ హోటల్‌ను తలపిస్తుంది..అచ్చంగా అన్నీ సదుపాయాలు ఉన్నాయి.మూడు రాత్రులతో నాలుగు రోజుల టూర్ ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది. 2000 మంది ప్రయాణించే వీలున్న ఈ షిప్.. 36 గంటల్లో విశాఖ నుంచి చెన్నై చేరుకుంటుంది..
ఈ షిప్ ప్రత్యేకతలు, ముఖ్యంగా జనాలకు సర్వీసు బాగా నచ్చడం తో షిప్ లో ప్రయాణం చెయ్యడానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.ఇందులో 11 అంతస్థులు ఉంటాయి. ఇందులో విలాసవంతమైన సౌకర్యాలు కల్పిస్తారు. ఇంజిన్, కార్గో తర్వాత మూడో ఫ్లోర్‌లో పాసింజర్ లాంజ్ మొదలవుతుంది. అక్కడి నుంచి ఎలివేటర్ ద్వారా పదో అంతస్థుకు చేరుకోవచ్చు. పదో ఫ్లోర్‌లో డెక్ లాంటి పెద్ద టెర్రస్ ఉంటుంది. పదకొండో అంతస్థులో ఉండే ప్రత్యేక సెటప్ ద్వారా సూర్యోదయం, సూర్యాస్తమయాలను ఆస్వాదించవచ్చు..
ఇకపోతే ఈ అతి పెద్ద షిప్ లో జిమ్, స్వి్మ్మింగ్ పూల్, కేసినో, కామెడీ షోల కోసం ఆడిటోరియం, కొత్త సినిమాలను చూడటం కోసం థియేటర్లు, 24 గంటల సూపర్ మార్కెట్ ఉండటం ఈ షిప్ ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల కోసం చాలా బాగుంది..మొత్తానికి వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది..ఇప్పుడు జనాల నుంచి మంచి స్పందన లభిస్తుంది.దీని వల్ల పర్యాటక ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వాలు భావిస్తున్నాయి..