పక్షుల మీద ప్రేమ తో మూడెకరాల్లో మొక్కజొన్న పంట!

-

ప్రకృతి మనిషికి మాత్రమే సొంతమా? కోటానుకోట్ల జీవరాశులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవించే మానవుడు.. తనకు తాను భూమిని శాసిస్తాననుకోవడం సరైనదేనా? పాపం పక్షులు ఏం చేశాయని.. స్వేచ్ఛగా ఎగురుతూ విహరించాల్సినవి ఆకలి దప్పికలతో విలవిల్లాడుతూ మనిషి స్వార్థానికి, కరెంటు తీగలకు వేలాడాల్సిందేనా?’ అచ్చం ఇలాంటి ప్రశ్నలే కర్ణాటకకు చెందిన ఓ రైతుకు తలెత్తాయి. అందుకే, తనవంతుగా పక్షుల కోసం మూడెకరాల్లో జొన్న పంట వేసేశాడు. ‘బర్డ్ మ్యాన్’గా పేరు తెచ్చుకున్నాడు.

Farmer
Farmer

వేళ దేవనగరె జిల్లా, శ్యామనూర్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్ కొంకాలా.. లాక్​డౌన్​లో పశుపక్షాదుల ఆకలి కేకల వార్త చదివాడు. వెంటనే.. దాదాపు 40శాతం ఆదాయం పక్షుల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతే కాదు పక్షులు, చిన్న చిన్న జంతువుల కడుపు నింపేందుకు తన మూడెకరాల పొలంలో.. మొక్కజొన్న పంట వేశాడు.

చంద్రశేఖర్ వేసిన పంట ఇప్పుడు పచ్చగా విరబూసింది. దీంతో పిట్టలు, పిచ్చుకలు, చిలుకలు, గిజిగాడు వంటి పక్షులు.. ఆనందంగా విహరిస్తున్నాయి. కడుపారా మొక్కజొన్న గింజలను ఆరగిస్తున్నాయి. కిలకిల రావాలు వినిపిస్తూ.. చూపరుల మనసు దోచేస్తున్నాయి. ఈ పక్షులను చూసేందుకు చంద్రశేఖర్ కుటుంబసభ్యులు, స్థానికులు వీలైనప్పుడల్లా అటువైపు వెళ్తుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news