తడబడ్డ ఆర్సీబీ.. CSK టార్గెట్ ఎంతంటే..?

-

ఆర్సీబీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అంటే అభిమానులు ఎగిరి గంతేస్తారు. ముఖ్యంగా ఇవాళ చెన్నైలో జరిగిన మ్యాచ్ లో చెన్నై టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆర్బీసీ బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు సాల్ట్ (32), విరాట్ కోహ్లీ 31 పరుగులు చేశారు. దేవదత్ పడిక్కల్ 27, కెప్టెన్ రజత్ పాటిదార్ 51 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. లివింగ్ స్టోర్, జితేష్ శర్మ 10, 12 పరుగులు చేసి పెవిలీయన్ కి చేరారు.

మరోవైపు కృణాల్ పాండ్యా సిక్స్ లు కొడుతాడని అభిమానులు భావించగా.. 3 బంతులు ఆడి డకౌట్ గా వెనుదిరిగాడు. చివర్లో టిమ్ డేవిడ్ హ్యాట్రిక్  సిక్స్ లు బాదాడు.  కేవలం 8 బంతుల్లో 22 పరుగులు చేశాడు టిమ్ డేవిడ్. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 3, పతిరానా 2, రవిచంద్రన్ అశ్విన్ 1, ఖలీల్ అహ్మద్ 1 వికెట్లు తీశారు. కీలక సమయంలో పతిరానా అద్భుతమైన బౌలింగ్ చేసి కెప్టెన్ రజత్ పాటిదార్ ను ఔట్ చేయడంతో ఆర్సీబీ 200 మార్క్ ని క్రాస్ చేయలేకపోయింది. ఆర్సీబీ 196 పరుగులు చేసింది. చెన్నై టార్గెట్ 197 పరుగులు. 

Read more RELATED
Recommended to you

Latest news