గతంలో కరోనా ప్రపంచాన్ని ఎంతలా ఇబ్బంది పెట్టిందో తెలిసిందే… ఇప్పటికీ కరోనా పేరు వింటేనే ప్రాణభయం తన్నుకువస్తుంది. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ ఒక కీలక విషయాన్ని బయటపెట్టింది. ఇంగ్లాండ్ మరియు అమెరికా దేశాలలో కరోనా లో EG.5.1 (ఎరిక్) వేరియంట్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచం మొత్తంగా జులై 10 నుండి ఆగష్టు 6 తేదీల మధ్యన కొత్తగా మరో 15 లక్షల కేసులు నమోదు అయినట్లుగా రిపోర్ట్స్ తెలియచేస్తున్నాయి. ఇక ఇందులో కరోనా తో పోరాడుతూ మరణించేవారి సంఖ్య 2500 గా ఉంది. ఇక గత నెలతో పోల్చి చూస్తే ఆగస్టు లో 80 శాతం వరకు కేసులు మరియు 57 శాతం మరణాలు పెరిగినట్లు తెలుస్తోంది.