ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు మొత్తం అతలాకుతలమై పోతున్నాయి. ఇక రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్న తరుణంలో బాధితుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. బాధితుల సంఖ్య కోటి నలభై ఎనిమిది లక్షలు దాటిపోయింది. మరి వైపు కరోనా వైరస్ బారినపడి మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కరోనా కేసుల్లో, కరోనా మరణంలో కూడా అగ్రరాజ్యమైన అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతోంది.
ఇప్పటి వరకు అమెరికాలో 1,43,834 మంది మరణించగా.. బ్రెజిల్ లో 80 వేల మందికి పైగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రపంచ ప్రజానీకం మొత్తం భయం గుప్పిట్లోనే బతుకుతుంది. ఈ వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాకపోవడంతో ప్రస్తుతం మరింత భయాందోళన పరిస్థితులు నెలకొంటున్నాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 1,48,55,107 కేసులు ఉండగా… ఆరు లక్షల మందికి పైగా మృతి చెందారు.. ఇక ఇప్పటి వరకు కరోనా భారీ నుంచి 89 లక్షల మందికిపైగా కోలుకున్నారు.