డీజీసీఐ నోటీసును త‌ప్పుప‌ట్టిన గ్లెన్‌మార్క్‌ కంపెనీ..!

-

ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్-19కు కొన్ని కంపెనీలు ఇప్పటికే వ్యాక్సిన్లను మార్కెట్ విడుదల చేశాయి. గ్లెస్ మార్క్ ఫార్మసీ కంపెనీ ఫాబిఫ్లూ(ఫెవిపరావిర్) ఔషధాన్ని మార్కెట్ లో అధిక ధరకు అమ్ముతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) సోమవారం గ్లెన్ మార్క్ కంపెనీకి నోటీసులు జారీ చేసింది.

Phabiphlu

ఆ నోటీసులకు స్పందించిన గ్లెన్ మార్క్ సంస్థ డీజీసీఐ చేసి ఆరోపణ బాధ్యతారహితంగా ఉన్నాయని పేర్కొంది. తమ కంపెనీ ఇప్పటివరకూ 150 మంది కరోనా పేషంట్లపై ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ నిర్వహించిందని, అలాంటి పద్ధతిపై డీజీసీఐ వ్యాఖ్యలు సరికాదన్నారు.కాగా, గ్లెన్ మార్క్ సంస్థ అధిక ధరకు డ్రగ్స్ అమ్ముతుందని ఓ ఎంపీ ఫిర్యాదు చేయడంతో డీజీసీఐ ఆ సంస్థకు నోటీసులిచ్చింది. కరోనా సోకిన బాధితుడికి తొలి, మధ్యస్థ దశలో ఫాబిఫ్లూ మాత్రలు ఇవ్వొచ్చని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా పేర్కొందని, మార్కెట్లో మాత్రల విడుదలకు జూన్19న అనుమతి ఇచ్చినట్లు గ్లెన్ మార్క్ సంస్థ వెల్లడించింది. రూ.103గా ఫాబిఫ్లూ ట్యాబ్లెట్ ధర నిర్ణయించడం జరిగిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version