భారత్ లో కరోనా కేసులు ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయి. కొత్త వేరియంట్ కాస్త వణుకు పుట్టించినా అధికారులు అప్రమత్తం అవ్వడంతో అది కూడా అదుపులోకి వచ్చింది. గత రెండు రోజులుగా వెయ్యికి దిగువనే నమోదైన కేసులు తాజాగా వెయ్యి దాటాయి.
గడిచిన 24 గంటల్లో 1,112 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసుల సంఖ్య 4,46,46,880కి చేరింది. నిన్న ఒక్కరోజే 1,892 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 20,821 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా ఒకరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,28,987 కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మొత్తం కేసుల్లో 0.05 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.77 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.58 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.