డీ గ్లామర్ లుక్ లో ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

-

ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు మేకప్ లేకుండా బయటకు రావడం లేదు . కానీ కొంతమంది హీరోయిన్లు ధైర్యంగా తమ మేకప్ లెస్ ఫోటోలను షేర్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. నిజానికీ సోషల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ తర్వాత అంతలా వైరల్ అయ్యేది ఈ సినిమా వార్తలే.. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కు సంబంధించి అప్డేట్స్ దగ్గర నుంచి ప్రతి చిన్న విషయం కూడా ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూ ఉంటుంది. సెలబ్రిటీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ హీరోయిన్ల ఫోటోషూట్స్, రేర్ పిక్స్ , వాళ్ళు చేసే పోస్టులు వద్దన్నా కూడా వైరల్ అవుతూ ఉంటాయి. హీరోయిన్లు తమ చిన్నప్పటి ఫోటోలను వితౌట్ మేకప్ ఫోటోలను షేర్ చేశారంటే చాలు వారిని త్వరగా గుర్తుపట్టడం అసాధ్యం.

ఈ క్రమంలోనే యంగ్ బ్యూటీ డింపుల్ హయతి కూడా మేకప్ లెస్ ఫోటో ఒకటి పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తీక్షణంగా గమనిస్తే తప్ప ఈ ఫోటోలో ఉన్నది ఆమె అని పోల్చుకోలేము.. డింపుల్ హయతి విజయవాడకు చెందిన తెలుగు అమ్మాయి. అక్కడ పుట్టి హైదరాబాదులో పెరిగింది . సునీల్ కుమార్ రెడ్డి గల్ఫ్ మూవీతో హీరోయిన్గా పరిచయమైన డింపుల్.. న్యూమరాలజీ ప్రకారం తన పేరుకి హయతి అని యాడ్ చేసుకుంది. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా, తమన్నా నటించిన అభినేత్రి సినిమాలో కీలకపాత్ర పోషించింది.అంతేకాదు గద్దల కొండ గణేష్ సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ ద్వారా కుర్రకారుకు మరింత కిక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

తర్వాత యురేకా సినిమా చేసింది . ఈ తెలుగు అమ్మాయి బాలీవుడ్ లో కూడా నటించిందంటే నమ్మడం అసాధ్యం . అలా ధనుష్, సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్ నటించిన “అంత్రాంగి రే” సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. చేసింది కొన్ని పాత్రలే అయినా విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ ఇయర్లో డింపుల్ హీరోయిన్ గా చేసిన విశాల్ సామాన్యుడు , రవితేజ ఖిలాడి సినిమాలు కూడా విడుదలయ్యాయి. ప్రస్తుతం గోపీచంద్ సినిమా లో అవకాశం దక్కించుకుంది. ఇకపోతే ఇలా మేకప్ లేకుండా ఫోటో షేర్ చేసిన ఈమె ధైర్యానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version