హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న చలికీ వేడి తెప్పిస్తున్న కరోనా కేసులు

-

దేశంలో కరోనా బీభత్సం సృష్టిస్తుంది. వివిధ రాష్ట్రాల్లో వైరస్​ ఉగ్రరూపం దాల్చుతోంది. విపరీతంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో గత 24 గంటలలో 967 మందికి టెస్ట్ లు చెయ్యగా 472 మందికి నెగటివ్, 37 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో 453 మంది పరీక్ష ఫలితాలు రాత్రి తొమ్మిది గంటలకు రానున్నాయి. మొత్తం రాష్ట్రంలో 5983 కేసులు నమోదు అయ్యాయి అందులో 1475 యాక్టివ్ గా ఉన్నాయి అని అధికారిక ప్రకటన విడుదల చేశారు. మొత్తం హిమాచల్ ప్రదేశ్ లో 33 మరణాలు చోటుచేసుకున్నాయి.

మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 16,408కేసులు బయటపడ్డాయి. మరో 296 మంది వైరస్​​కు బలయ్యారు. ఇప్పటివరకు 5 లక్షల 62 వేల మందికిపైగా రికవరీ అయ్యారు.ఉత్తర్​ప్రదేశ్​లో తాజాగా 6,233 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. 67 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 25 వేలు దాటింది.బిహార్​లో ఒక్కరోజే 2,078 మందికి కొవిడ్​ నిర్ధరణ అయింది. అయితే కొత్త కేసుల కంటే రికవరీ అధికంగా ఉండటం విశేషం. ఇవాళ ఒక్కరోజు 2,231మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news