కరోనా వచ్చినదనుకుని ఆత్మహత్య చేసుకున్నాడు… కాని తర్వాత…

-

కరోనా వైరస్ లక్షణాలు ప్రజలను వెంటాడి వేధిస్తున్నాయి. కరోనా లక్షణాలు కనపడటంతో కొందరు ప్రాణాలు బలవంతంగా తీసుకుంటున్నారు. తాజాగా విశాఖ జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి స్థానికులను ఆందోళనకు గురి చేసింది. కరోనా సోకిందేమోననే అనుమానంతో ఓ యువకుడు ప్రాణం తీసుకున్నాడు. విశాఖలోని చినగదిలి బీసీ కాలనీకి చెందిన ఆకిన వసంతకుమార్‌ భార్య, ఇద్దరు కుమారులతో జీవిస్తున్నారు.

వారి కుటుంబం అందరికి జ్వరం వచ్చింది. దీనితో అందరూ కరోనా నిర్ధారణ పరిక్షలు చేయించుకున్నారు. అందరికి నెగటివ్ వచ్చింది గాని వారి రెండో కుమారుడు అయిన హరికృష్ణ రిపోర్ట్ రాలేదు. దీనితో తనకు కరోనా వచ్చి ఉండవచ్చు ఏమో అనే ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందరు నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకోగా అదే రోజు వచ్చిన రిపోర్ట్ లో నెగటివ్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version