ఆస్ప‌త్రిలో జ‌పాన్ ప్ర‌ధాని..

-

జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబే అనారోగ్య సమస్యలతో సోమవారం టోక్యోలోని ఆస్పత్రిలో చేరారు. ఆయ‌న‌కు దాదాపు ఏడున్నర గంటలు పరీక్షలు నిర్వహించినట్లు స్థానిక మీడియా వెల్ల‌డించింది. షింజో అబే అనారోగ్యానికి గురవ్వడంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే అబే ఆస్పత్రిలో చేరడం ఇదేం మొదటి సారి కాదని.. ఇంతకు ముందు కూడా ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ఆస్పత్రిలో చేరారని స్థానిక మీడియా తెలిపింది.

అయితే.. ఆయన కేవలం జనరల్‌ చెకప్‌ కోసం వచ్చినట్లు, అబే ఆరోగ్యం క్షేమంగానే ఉందని ఆర్థికమంత్రి కట్సునోబు కటో తెలిపారు. ఇదిలా ఉండగా దేశంలో ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా అబే రికార్డు సృష్టించారు. అయితే.. ఇంతకముందు తన మేనమామ ఐసాకు పేరు మీద ఉన్న ఈ రికార్డును అబే సోమవారంతో అధిగమించాడు. ఈ రికార్డుసాధించిన త‌ర్వాత‌ అతను రాజీనామా చేయవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. నిజానికి.. 2007లో ఆరోగ్య సమస్యల వల్ల తన పదవీకి రాజీనామా చేసి 2012లో మళ్లీ అధికారంలోకి వచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version